నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రారాజ్ కల్లాలి తాండా గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు , ఈవెంట్ ను ఘనంగా నిర్వహించామని అంగన్వాడీ టీచర్ రాధా తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని బాలింతలు గర్భిణీలను సెంటర్ కు ఆహ్వానించారు . తల్లిపాల వారోత్సవాలను ఈనెల 1వ తారీఖు నుండి 7వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, ఐసిడిఎస్ ఆదేశానుసారం కార్యక్రమాలు ఏడు రోజులపాటు చేపడుతున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా బాలింతలకు ,గర్భిణీలకు , కౌమార దశలో ఉన్న బాలికలకు, మహిళలకు తల్లిపాల విశిష్టత గురించి వివరించారు. తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి అని అన్నారు. బిడ్డ పుట్టగానే తల్లిపాలను పట్టాలని సూచించారు. తల్లిపాలు అంటే అమృతంలా పనిచేస్తాయని, పోషక విలువలు పరిపుష్టంగా ఉంటాయని , రోగ నిరోధక శక్తి పెంచుతుందని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి పాలు పట్టించాలని విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం , ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాధా తో పాటు , ఆశా కార్యకర్త , ఆయా , బాలింతలు , గర్భిణీలు , పిల్లలు , తాండవాసులు, తదితరులు పాల్గొన్నారు.
కేమ్రాజ్ కల్లాలి తాండ అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES