అంగన్ వాడి టీచర్ కల్యాణి
నవతెలంగాణ – మల్హర్ రావు
తల్లి ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్యకరంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతామని అంగన్ వాడి టీచర్ ఎన్.కల్యాణి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక, మండల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు గురువారం మండలంలోని కొండంపేట అంగన్ వాడి సెంటర్-1లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ ఆమె మాట్లాడారు. బిడ్డ జన్మించిన గంటలోపే తల్లి ముర్రుపాలు బిడ్డకు పట్టిస్తే జీవితాంతం రక్షణగా ఉంటుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కై ముర్రు పాలను బిడ్డకు పట్టించాలని తెలిపారు. పిల్లల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు ముర్రు పాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు పాల్గొన్నారు.
కొండంపేటలో తల్లిపాల వారోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES