Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్శంకరపట్నంలో తల్లిపాల వారోత్సవాలు

శంకరపట్నంలో తల్లిపాల వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలంలో తల్లిపాల వారోత్సవాలను సీడీపీవో ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్, తాసిల్దార్ సురేఖ, మెడికల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, ఎంఈఓ లక్ష్మీనారాయణ, మరియు సి హెచ్ ఓ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, సీడీపీవో శ్రీమతి మాట్లాడుతూ, తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత అదనంగా పోషకాహారాన్ని కూడా అందించాలని సూచించారు. తల్లిపాలు తాగిన పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, తల్లికి, బిడ్డకు మధ్య అనుబంధం కూడా పెరుగుతుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీడీస్ సూపర్వైజర్లు పద్మ, అరుణ, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎం లు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img