- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని చొక్కన్న పల్లి అంగన్వాడి పాఠశాలలో సోమవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దండ సెక్టార్ సూపర్వైజర్ శ్రీమత్తమ్మ మాట్లాడుతూ.. తల్లి పిల్ల క్షేమం కోసం అంగన్వాడి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా గర్భవతులు పౌష్టికాహారాన్ని తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు తల్లిపాల ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మెర్లీన్ , మాసమ్మ, స్వప్న, అలివేలు , శివమ్మ , మల్లమ్మ తదితరులు ఉన్నారు.
- Advertisement -