నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు మరింత క్షీణించాయి. సోమవారం కూడా గాలి నాణ్యతలు ప్రమాదకరస్థాయిలో నమోదయ్యాయి. ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయానికి 452 స్థాయిల వద్ద ఎక్యూఐ నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వర్గీకరించింది. ఇక ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికి 461 వద్ద ఎక్యూఐ నమోదైందని సిపిసిబి తెలిపింది. దట్టమైన పొగమంచు కురవడంతో కనుచూపు మేర ఏమీ కనపించని పరిస్థితి నెలకొంది.
కాగా, ఢిల్లీలోని అయా నగర్ 406, చాందినీ చౌక్ 437, ఆర్ కె పురం 477, ద్వారకా సెక్టార్ 462 స్థాయిల వద్ద ఎక్యూఐ నమోదైంది. వజీర్‌పూర్‌లో అత్యధికంగా ఎక్యూఐ 500 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.



