Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు163 జాతీయ రహదారిపై కూలిన బ్రిడ్జి.. వాహనాల మళ్ళింపు

163 జాతీయ రహదారిపై కూలిన బ్రిడ్జి.. వాహనాల మళ్ళింపు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ నుండి ములుగు వెళ్లే జాతీయ రహదారి పై ఉన్న ప్రార్థన బ్రిడ్జి కూలిన సంఘటన గురువారం జరిగింది. హనుమకొండ నుండి ములుగు వెళ్లే 163 వ జాతీయ రహదారి ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రములో కెనాల్ పై ఉన్న పురాతన బ్రిడ్జి బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. దీంతో హనుమకొండ నుండి ములుగు వెళ్లే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ సంతోష్ ఆధ్వర్యంలో 163 వ జాతీయ రహదారి గుడెప్పాడ్ జంక్షన్ వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి మల్లంపల్లి వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ములుగుతో పాటు, వయా ములుగు మీదుగా ఎటూరునాగారం ,గుంటూరు, విజయవాడ ,వెళ్లే వాహనాలను పరకాల మీదుగా రేగొండ, అబ్బాపూర్, ములుగు వెళ్ళే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ మళ్లించే కార్యక్రమంలో ఎస్సై వి.తిరుపతి ఎస్ఐ సతీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img