- Advertisement -
జాతీయ పోటీల్లో
సిల్వర్ మెడల్ కైవసం
హైదరాబాద్ : డెహ్రాడూన్‌లో జరిగిన 20వ జాతీయ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో తెలంగాణ ఓవరాల్ రన్నరప్‌గా నిలిచింది. మహారాష్ట్ర ఏడు స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలువగా.. ఐదు పసిడి పతకాలతో తెలంగాణ సిల్వర్ మెడల్ సాధించింది. గురువారం ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ ఐస్ స్కేటర్లు నయనశ్రీ, ప్రణవ్ మాధవ్, ఆరుశ్, మహన్య రెడ్డి, అన్విత్, సన్సిత రెడ్డి, చానస్య, సుహాన్‌లను శాట్జ్ చైర్మెన్ కే.శివసేనా రెడ్డి అభినందించారు.
- Advertisement -