లండన్ : బ్రిటన్ డిప్యూటీ ప్రధాని ఏంజెలా రేనర్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేసిన విషయంలో ప్రభుత్వ మంత్రులు పాటించవలసిన నైతిక ప్రమాణాలను ఆమె పాటించలేదని స్వతంత్ర దర్యాప్తులో వెల్లడి కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేసవికి ముందు ఇంగ్లాండ్‌లోని దక్షిణ తీర ప్రాంతంలోని హోవ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినపుడు తగిన పన్ను చెల్లించలేదని ఆమె బుధవారం అంగీకరించారు. తాను మంచిగా విశ్వసనీయతతోనే వ్యవహరించానని విచారణ నివేదిక పేర్కొందనీ, కానీ పన్ను విషయంలో మరింత నిర్దిష్టంగా వ్యవహరించడం కూడా కీలకమని భావించిందని చెప్పారు. జరిగిన పొరపాటుకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెబుతూ ఆమె తన రాజీనామా లేఖను ప్రధాని కెయిర్ స్టార్మర్‌కు పంపించారు. దీనిపై ప్రధాని విచారం వ్యక్తం చేస్తూ, రేనర్ సరైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. నీతి నిజాయితీలతో రేనర్ వ్యవహరించినా, ప్రజా సేవ పట్ల అద్భుతమైన నిబద్ధతను కనబరిచినా, మంత్రుల నైతిక ప్రవర్తనా నియమావళిని ఆమె ఉల్లంఘించడం విచారకరమని స్వతంత్ర దర్యాప్తు చేపట్టిన లారీ మాగస్ వ్యాఖ్యానించారు.
ఇంటి కొనుగోలుపై పన్ను చెల్లించనందుకు బ్రిటన్ డిప్యూటీ ప్రధాని రాజీనామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES