Thursday, July 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విరిగిపడ్డ ఫ్యాన్.. పిల్లాడి తలకు తీవ్ర గాయాలు 

విరిగిపడ్డ ఫ్యాన్.. పిల్లాడి తలకు తీవ్ర గాయాలు 

- Advertisement -

– కస్ర అంగన్వాడి కేంద్రంలో ఘటన..
– అంగన్వాడీ టీచర్, ఆయమ్మ పై గ్రామస్తుల ఆగ్రహం..
– పిల్లవాడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్వో
వైద్యం ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందిని హామీ..
నవతెలంగాణ – కుభీర్:
ఫ్యాన్ విరిగిపడి విద్యార్థికి గాయాలైన సంఘటన కుబీర్ మండలంలోని కస్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం అంగన్వాడి కేంద్రంలో పిల్లలు చదువుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఫ్యాన్ విరిగిపడి వీరాజ్ 3 అనే పిల్లవాడిపైన పడడంటో తలకు తీవ్ర గాయమైంది వెంటనే పిల్లవాడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. సంఘటన జరిగిన సమయానికి అంగన్వాడీ టీచర్ అంగన్వాడీలో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడి టీచర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడుతున్నారు. 
పిల్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తహసిల్దార్…
ఫ్యాన్ విరిగిపడి పిల్లవాడి తలకు గాయాలైన విషయం తెలుసుకున్న తహసిల్దార్ బుధవారం కస్ర గ్రామానికి వెళ్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కరెంట్ బోర్డు నుండి డైరెక్ట్ గా ఫ్యాన్ కనేక్షన్ ఇవ్వడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేశారు.వెంటనే  దగ్గర ఉండి నూతన ఫ్యాన్ ను పెట్టించడం జరిగింది. అనంతరం అక్కడి నుండి పిల్లాడి దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పిల్లవాడికి అయ్యే వైద్యు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. అనంతరం ఐసిడిఎస్ అధికారులతో మాట్లాడుతూ మండలంలో అంగన్వాడీ సెంటర్లలో ఫ్యాన్లు, కరెంటు బోర్డుల పరిస్థితిని సోమవారం రోజు వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. మీ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంఘటన జరిగిన సమయంలో టీచర్ ఎందుకు లేదని ప్రశ్నించగా టీచర్    పలు రికార్డులను తీసుకొని ఆఫీసుకు రమ్మన్నామని దింతో ఆమె అక్కడికి వచ్చిందని తెలిపారు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఐసీఐడీస్ అధికారులకు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -