నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సివిల్ డిఫెన్స్ రంగంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినందుకుగాను ఆ శాఖ డిప్యూటీ డీజీఎం ఉదయ్ నాథ్ కోట్లాకు జనరల్ డిస్క్(కాంస్యం) పురస్కారం లభించింది. జోన్‌వ్యాప్తంగా పదో బెటాలియన్ ఎన్‌డీఆర్‌ఎఫ్, బీడీ బృందాలు, ఆర్‌పీఎఫ్, వైద్యవిభాగాలతో కలిసి విశాలస్థాయి మాక్‌డ్రిల్లులను సమర్థవంతంగా సమన్వయం చేయడంతోపాటు తెలంగాణ ఆక్టోపస్ నిర్వహించిన పలు కార్యక్రమాలో ఉదయ్ నాథ్ పాల్గొన్నారు. అలాగే కాచిగూడ, రాయచూర్, ఔరంగాబాద్‌లో నిర్వహించి ఆపరేషన్ షిల్డ్(సిందూర్) వంటి కీలక వ్యాయామాల్లో దక్షిణ మధ్య రైల్వే చురుగ్గా పాల్గొన్నది. డిజిటల్ విభాగాన్ని సైతం సమన్వయం చేశారు. అందరిక సహకారంతోనే ఈ పురస్కారం వచ్చిందని ఉదయ్ నాథ్ కోట్లా అభిప్రాయపడ్డారు.
ఎస్‌సీఆర్ డీజీఎంకు కాంస్య పురస్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



