బడే నాగజ్యోతి.. బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్
మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి
నవతెలంగాణ – గోవిందరావుపేట
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కాంపాటి కృష్ణ నివాస గృహంలో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షులు లాకవత్ నరసింహా నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగజ్యోతి హాజరై మాట్లాడారు.ఐకమత్యమే మహా బలం… కలిసికట్టుగా పనిచేస్తే విజయం తద్యం అన్నారు.కెసిఆర్ సంక్షేమ పథకాలను, రేవంత్ అమలుగాని హామీలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.అసమర్ధ కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారన్నారు.
ఆరు గ్యారంటీల మోసాన్ని, 420హామీలను ప్రజలకు వివరించాలి. రేపటి రోజుల్లోబి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు స్థానిక ఎన్నికలే పునాదులన్నారు.ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా అదైర్యపడకండి కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. ప్రజలు కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని రాబోయే రోజుల్లో కెసిఆర్ పాలన రావాలంటే స్థానిక ఎన్నికలే అందుకు పునాదులు వేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఎన్నికలు ఏవైనా టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరధం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, వెలిశాల స్వరూప, ఆలూరి శ్రీనివాసరావు, లావుడియా రామచందర్, లకావత్ చందులాల్, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి,మహిళా మండల అధ్యక్షురాలు బత్తుల రాణి, ఇరుప విజయ, ఏ. హనుమంతరావు, నా పూర్ణచందర్, ఏ రమేష్, తాటికొండ శ్రీనివాస చారి, బి. కేదారి, అజ్మీర సురేష్, మీడుదల వెంకన్న, చుక్క గట్టయ్య, బి. మధు, వర్ధo చందర్ రాజ్, రుద్ర బోయిన మల్లేష్ గౌడ్, మాలోత్ గాంధీ, ఎండి అజిజ్, గంధర్ల సాంబయ్య, అనుము, వజ్ర నరేందర్, లావుడియా వగ, జిల్లెల్ల కొమురయ్య, గజ్జి ఎలంధర్, బోళ్ల రాజులు, బైకాని ఓదెలు, ఏళ్ల శ్రీనివాస్, డి శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, ఓదెల మొండయ్య, ఉట్ల మోహన్, భూక్య వెంకటస్వామి, రేళ్ల శ్రీనివాస్, కె జ్యోతి, కందాల ఇంద్రారెడ్డి, పున్నం రవికుమార్, కృష్ణారెడ్డి, రంజిత్, దర్శనాల సంజీవ, బోల్ల శివ, భాను తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే బీఆర్ఎస్ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES