- Advertisement -
– 20న ప్రమాణ స్వీకారం
–నవతెలంగాణ–పెద్దవూర
రాష్ట్రంలో మోగిన ఎన్నికల నగారాలో భాగంగా ఈ నెల 14 పెద్దవూర మండలంలోని హనుమంతు లింగంపల్లి గ్రామంలో జరిగిన రెండవ దశ స్థానిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నల్లమెట్టి లక్ష్మమ్మ 96 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రామంలో కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన సర్పంచ్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన హనుమంతు లింగంపల్లి గ్రామ ప్రజలకు,యువతకు,మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. పేద ప్రజలకు సేవచేస్తానని తెలిపారు.
- Advertisement -



