– గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా..
నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థ ల రెండవ విడత నామినేషన్ల లో భాగంగా మంగళవారం మండలం లోని బట్టుగూడెం గ్రామానికి చెందిన వెలుగు అనిత అంజయ్య,నాగార్జున సాగర్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు నోముల భగత్,మాజీ ఎంపిపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బారీ ర్యాలీ గా తరలి వచ్చి నామినేషన్ ధాకలు చేశారు. ఈ సందర్బంగా అనిత మాట్లాడుతూ.. అందుబాటులో ఉండి గ్రామం లో సమస్యలన్నీ నిజాయితీగా బాధ్యతగా పరిష్కరిస్తామన్నారు.గ్రామం లో అందరికి అందుబాటులో ఉంటూ సమస్యల సాధనకు కృషి చేస్తామన్నారు.
ఈ నెల 14 న జరుగునున్న ఎన్నికలో మీరు మీ ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్థారని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. మన గ్రామం అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్థానని, అవి సక్రమంగా ఖర్చుచేసి బాద్యతగా పని చేస్తానని తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకొని పరిష్కరిస్థానని చెప్పారు. అణునిత్యం అందుబాటులో ఉండి ఒక సేవకురాలుగా పని చేస్తానని కోరారు. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

