Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి 

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి 

- Advertisement -

మాజీమంత్రి దయాకర్ రావు 
నవతెలంగాణ – పాలకుర్తి

బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని టీఎస్ కే తండా, దర్దేపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచిందని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలంటే బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి లతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -