No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్బాల్కొండ నియోజకవర్గంలో ఊరురా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

బాల్కొండ నియోజకవర్గంలో ఊరురా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు ఆ పార్టీ శ్రేణులు ఊరురా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ‘కాళేశ్వరం కొట్టుకుపోలేదు- కూలిపోలేదు… ఇదిగో- బాల్కొండలో కాలేశ్వరం పనులు’ అని పేర్కొంటూ బాల్కొండ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరిగిన పనుల ఫోటోలను, అందుకైనా ఖర్చును ఫ్లెక్సీల్లో ముద్రించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం, లక్ష కోట్లు వృధా చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల విమర్శలను తిప్పికొట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఊరూరా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.ఊరురా ఫ్లెక్సీలను  ఏర్పాటు చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. కాళేశ్వరం  ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగయే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమీ కాలేదన్నా నిజాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad