నవతెలంగాణ – పెద్దవూర
రాజకీయాలకు అతీతంగా అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని భారీ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణి చేసి మాట్లాడారు. గతంలో దొడ్డు బియ్యం 80 శాతం పక్కదారి పట్టేవని, ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు, నల్గొండ జిల్లాలో మొత్తం 62,707 కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడ్డాయి. 1,22,423 మంది సభ్యులను ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకు చేర్చారు. గతంలో, నల్గొండ జిల్లాలో మొత్తం 4,65,998 రేషన్ కార్డులు ఉండగా, 13,91,798 మంది సభ్యులు ఉన్నారు.
కొత్త కార్డులు సభ్యుల చేరికతో, ప్రస్తుత మొత్తం 5,28,153 రేషన్ కార్డులు, 16.56,559 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు .నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 10,836 కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడ్డాయి. 20,670 మంది సభ్యులను ఇప్పటికే ఉన్న కార్డులకు చేర్చారన్నారు. ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్షమన్ కుమార్ మాట్లాడుతూ .. మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇక, కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించిందని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షలవరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ ఆశించిన మేర జరగలేదని, ఎక్కువ సంఖ్యలో రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి రేషన్ కార్డులు పంపిణీని ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిమాట్లాడుతూ.. మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇక, కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించిందని తెలిపారు. రేషన్ కార్డుల స్థితిని పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రానివారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
స్థానిక ఎంఎల్ ఏ జయవీర్ రెడ్డి మాట్లాడుతూ .. మండలంలో 3600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, గతంలో ఒక్కఇల్లు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రెటరీ స్వామీ,అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయన్,తహసీల్దార్ శ్రీనివాసరావు,ఎంపీడీఓ ఉమాదేవీ,మాజీ జెడ్పివైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి,మాజీ ఎంపీపి శంకర్ నాయక్,ఎంఎల్ సీ,కేతావత్ శంకర్ నాయక్,మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి,మాజీ జెడ్పిటీసి అబ్బిడీ కృష్ణారెడ్డి,గుంటుక వెంకట్ రెడ్డి,అధ్యక్షులు పబ్బు యాదగిరి,తోడిమ సుధాకర్ రెడ్డి,వాసుదేవుల రవీందర్ రెడ్డి,మండల యూత్ అధ్యక్షులు రేపాకుల సాయి కుమార్,అధ్యక్షులు,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి ఉత్తమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES