Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాబు జల దోపిడిపై బీఆర్ఎస్ జంగ్ సైరన్..

బాబు జల దోపిడిపై బీఆర్ఎస్ జంగ్ సైరన్..

- Advertisement -

భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

తెలంగాణ రాష్ట్ర జల వనరులపై తెలంగాణ హక్కును సాధించేందుకు ప్రజలు, విద్యార్థులలో చైతన్యం కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా “బనకచర్ల నీటి హక్కుల కోసం జంగ్” ఉద్యమం వేగంగా ముందుకు సాగుతుందని బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్ అన్నారు. బుధవారం ఆయన ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. అక్రమ బనకచర్ల ప్రాజెక్ట్ అడ్డుకుంటామని బాబు రేవంత్ చీకటి ఒప్పందాన్ని ఎండ కడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఏపీ ప్రయోజనాల కోసం అక్రమ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించడానికి సన్నద్ధమవుతున్న సమయంలో ఎలాంటి గోదావరి,కృష్ణా నదుల యాజమాన్యాల బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా అపెక్స్ కౌన్సిల్ చర్చ జరగకుండా ఆంధ్ర నాయకుడికి సహకరిస్తున్నాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మున్నా,  ఏర్పుల అరవింద్,  భువనగిరి మండల అధ్యక్షులు కనకల మహేష్, భువనగిరి మండల యూత్ అధ్యక్షులు ముల్లె నాగేంద్రబాబు, పల్లెపాటి నరసింహ, కొంగల వంశి, రమేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -