– దండు పాళ్యం బ్యాచ్ పేరు వారికే వర్తిస్తుంది : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నేతలు బందిపోటు దొంగలకు మించిపోయారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల గృహసముదాయంలో ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం, మందుల సామేలు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్ యాదవ్‌లతో కలిసి ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కేబినెట్‌ను ”దండుపాళ్యం బ్యాచ్” అని పిలవడం దురదృష్టకరమన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకొని స్టువర్ట్‌పురం దొంగలకు మించిన బంది పోట్లు వారేనని తిప్పికొట్టారు. హరీశ్‌తోపాటు ఆయన బామ్మార్ది, మామ దండుపాళ్యం ముఠాగా రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. దళితులు, బలహీన వర్గాలు ఉన్న క్యాబినెట్‌ను అవమానపరచడం సిగ్గుచేటనీ, ఈ రకంగా వారు తెలంగాణ దళితులను అవమానిస్తున్నారని దుయ్యబట్టారు.దళితుల మీద తుపాకులు పెట్టి బెదిరించిన రోజులు గుర్తున్నాయా హరీష్ రావు? అంటూ ప్రశ్నించారు. మంత్రి వర్గం, సీఎంపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలనీ, లేదంటే ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ నేతలు బందిపోటు దొంగలకు మించినోళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



