- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట బుధవారం, కొందరు బిఆర్ఎస్ నాయకులు గ్రామ అభివృద్ధిని, దాతల సేవలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో దాతలు ఫ్రీగా నాణ్యమైన మంచినీరు ప్రజలకు అందించేందుకు ముందుకు వస్తున్నారని వారిని బిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. స్థలం సాకుతో అంగన్వాడి భవనాన నిర్మాణాన్ని అడ్డుకున్నారని అన్నారు. గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు అందివ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డు అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -