Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుశాసన మండలిలో బీఆర్ఎస్ నేత‌ల‌ ఆందోళ‌న‌

శాసన మండలిలో బీఆర్ఎస్ నేత‌ల‌ ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించనున్నట్లు శాసనసభ నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ శాసన మండలిలో భారత రాష్ట్ర సమితి (BRS) సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మండలి ఛైర్మన్‌ పోడియాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీలు చుట్టుముట్టి నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.

కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ప్రతులను భారత రాష్ట్ర సమితి సభ్యులు చించివేసి ఛైర్మన్‌ వైపు విసిరారు. ‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు రావొద్దని.. కేటాయించిన స్థానాల్లోనే నిరసన తెలపాలని సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీల నిరసనల మధ్యే మంత్రులు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం పంచాయతీరాజ్‌ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతిక్‌ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు మండలి ఛైర్మన్‌ ప్రకటించారు.

మ‌రోవైపు బీఆర్ఎస్ ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill) ఆమోదం పొందింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ చేస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన అల్లోపతిక్ బిల్లులను ఏకగ్రీవంగా శానసమండలి ఆమోదించింది. అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad