నవతెలంగాణ – గోవిందరావుపేట
ములుగు జిల్లా ఎటునాగారం మేజర్ గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎటునాగారం సర్పంచ్ గా ఎన్నికైన కాకులమర్రి శ్రీలతకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నీ తానై నడిపించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుని ఆదివారం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకులతో లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ.. రాబోయే రోజులలో జరగబోయే అన్ని ఎలక్షన్లలో ఇలాగే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ విజయం ఎటునాగారం ప్రజలదని బీఆర్ఎస్ పార్టీ కి ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని కార్యకర్తలకు జిల్లా అధ్యక్షునిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎలాంటి ఆపద వచ్చిన అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్షులు లకావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, అంబటి వినయ్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు బొల్లం ప్రసాద్, చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు పూర్ణచందర్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



