- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు లింగంపెట్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో నేడు లింగంపేట్ లో ఆత్మ గౌరవ గర్జన సభ జరగనుంది. ఈ సభకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేస్తుండడంతో మండలం నుండి సభకు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యం, మాజీ వైస్ చైర్మన్ రాజు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పత్తి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రమేష్, మాజీ కోఆప్షన్ నెంబర్ ముస్తఫా, నాయకులు జింగురు సురేష్, మల్లేష్, సాయిలు, సంతోష్, శ్యామ్, గౌస్, కొండే సాయిలు తదితరులు ఉన్నారు.
- Advertisement -