Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌

అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేస్తూ …. సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ వద్ద బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. మరోవైపు.. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్నాను కవర్‌ చేయకుండా మీడియాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలవడానికి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బఅందం వెళ్లింది. అయితే, స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా కవర్‌ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -