- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ జిల్లాల తిరుపతిరెడ్డి, కత్తుల సమ్మరాజు నాయకులు బొల్లితిరుపతి మహమ్మదాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంఘ శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బంక చందు , డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్, మామిడి తిరుపతి, మెరుగు వెంకటయ్య, దుద్దెడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



