Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుHydra : హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Hydra : హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: మాదాపూర్‌లోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అడ్డుకున్నారు. సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపును సోమవారం హైడ్రా చేపట్టింది. సున్నం చెరువులో కూల్చివేతలను ఆపేయాలని అరెకపూడి గాంధీ డిమాండ్ చేశారు.

32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్‌ ట్యాంకర్లను సీజ్‌ చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img