మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా వెళ్లి సత్తా చాటాలని, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి కార్యకర్తలు,నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించి,మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం అమలు గాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.420 హామీలు అమలు చేస్తామని వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.
నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కేసీఆర్ సంక్షేమ పథకాలే ఇప్పటికీ ప్రజలకు అందుతున్నాయని, కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందేమీ లేదన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వున్ననాడు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మండలానికి అనేక నిధులు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ మచ్చి ఇరువై నెలలు గడుస్తున్న ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు.ప్రస్తుతం యూరియా కోసం రైతులు అల్లాడుతున్న కనీసం పట్టించుకునే నాధుడే లేడన్నారు.ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని,ఎలక్షన్లు అయిపోయాక మళ్లీ తిరిగి చూడరని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను,అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు కలిసికట్టిగా పనిచేసి విజయం సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు,మాజీ పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు,తాడిచెర్లమాజీ ఎంపిటిసి రావుల కల్పన-మొగిలి, మాజీ కొప్సన్ ఆయుబ్ ఖాన్,సింగిల్ విండో డైరెక్టర్లు,మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.