Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు

మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు

- Advertisement -

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కన్వీనర్ సునార్కని సాంబశివ
నవతెలంగాణ – కన్నాయిగూడెం

ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదీవాసీ గిరిజిన జాతర మేడారం. బీఆర్ఎస్ ప్రభత్వ హయాంలో సమ్మక్క సారలమ్మల జాతరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అప్పడు ఎమ్మెల్యేగా ఉన్న (ధనసరి అనసూయ) సీతక్క ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ములుగు జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో-కన్వీనర్ సునార్కని సాంబశివ అన్నారు. ఒకవైపు మహాజతర పనులు జరుగుతుంటే బీఆర్ఎస్ మరోవైపు వందల కొద్ది లారీలలో ఇసుకను తరలిస్తూ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.

అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు ఘటనలు లేకపోలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సీతక్క ప్రపంచ చరిత్రలో 200 ఏండ్లు గుర్తుండిపోయేలా మేడారం పనులను తన భుజాలపై వేసుకుందని అన్నారు. మేడారం అభివృద్ది పనులకు సీతక్క శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ అభివృద్దిని ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పెయిడ్ యూట్యూబ్, పెయిడ్ పింక్ సోషల్ మీడియాతో ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు సిగ్గు తెచ్చుకొని రాజకీయ లబ్ధి కోసం దిగజారి మంత్రి పైన లేనిపోని అబండాలు వెయ్యడం మానేయ్యండని జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కన్వీనర్ సునార్కని సాంబశివ వ్యాఖ్యనించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -