Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సిబిఐ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ రాస్తారోకో 

సిబిఐ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ రాస్తారోకో 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ సిబిఐ విచారణ అప్పగించేందుకు తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జెడ్పిటిసి పుస్కూరి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాడి చేస్తుందని తెలిపారు. కాలేశ్వరం ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్లను కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిబిఐ విచారణ పేరుతో కాలేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ లతో కలిసి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు అండగా ఉన్నారని, కాలేశ్వరం ప్రాజెక్టు సిబిఐ కి అప్పగించాలని కోరడంతో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని తెలిపారు. కాలేశ్వరం విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోడీలు రేవంత్ రెడ్డి త కలిసి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాలేశ్వరం పేరుతో సిబిఐ కేసిఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దొంతమర్ల గణేష్, కారుపోతుల వేణు, మాచర్ల ఎల్లయ్య, కటారి పాపారావు, మాటూరి యాకయ్య లతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad