నవతెలంగాణ – ఆలేరు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితిలో లేదని ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ..పురాణాలలో కుంభకర్ణుడు ఆరు నెలలు తిని ఆరునెలలు నిద్రపోయినట్లు గా కేసీఆర్ రాజకీయం ఉందని హెద్దేవ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాలు బయట పెట్టకుండా, ఫామ్ హౌస్ లోచెట్టు కింద హాయిగా కుర్చీ వేసుకొని, జల్సాలు చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. రిటర్మెంట్ అయి ప్రతిపక్ష నాయకుని బాధ్యత వేరొకరు అప్పగించాలని డిమాండ్ చేశారు.మరో పక్క రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బురద జల్లడం బురద జల్లడం తెలంగాణ ప్రజలు సహించారన్నారు.
కనీసం బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీసు కు కూడా రాకుండా నాయకులనే ఫామ్ హౌస్ కు పిలిపించుకుంటు రాజకీయాలు నడపాలి అనుకుంటున్నా ఆయనకు పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద ఉన్న గౌరవం ఏమిటో తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్నారు. అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్, పోయాక కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేసే మా ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు…జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఘనవిజయం ఖాయమని కేసీఆర్ అంటున్నాడు.. ఎందుకు గెలిపించాలో చెప్పలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు.
ముందు అసలు మీకు డిపాజిట్ వస్తుందో రాదో చూసుకోఅన్నారు…బీఆర్ఎస్ ను గెలిపించడానికి కేసీఆర్ ఒక్క కారణం చెప్పాలన్నారు. తెలంగాణను నాశనం చేశావనే ఓడించి నిన్ను ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నారు..ఇంకా ఏ మోహం పెట్టుకుని జూబ్లీహిల్స్ లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రౌడీ షీటర్ కు టికెట్ ఇచ్చిందని కేసీఆర్ అనటం బాధాకరమన్నారు…ఒక బీసీ యాదవ బిడ్డను రౌడీషీటర్ అని కేసీఆర్ అవమానించాడు..బీసీలను రౌడీలుగా చూపించడానికి కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బీసీలు అంటే అంత చులకనగా కేసీఆర్ కు కనిపిస్తున్నారా.. అంటూ ప్రశ్నించారు.
బడుగు బలహీన వర్గాలను కించే పర్చేలా మాట్లాడుతున్న కేసీఆర్, కేటీఆర్ కు తగిన బుద్ది చెప్పాలి అన్నారు..నవీన్ యాదవ్ పైన రౌడీ షీట్ ఉందా..? ఎన్ని కేసులు ఉన్నాయో కేసీఆర్ చూపించాలన్నారు అయ్య కేసీఆర్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అంటాడు..కొడుకేమో సల్మాన్ ఖాన్ అనే రౌడీ షీటర్ కు కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటడు తండ్రి కొడుకుల మాటల గారడి ప్రజలు ఎప్పుడు నమ్మరు అన్నారు.
సల్మాన్ ఖాన్ పై 32 కేసులు ఉన్నాయి.. కేటీఆర్ .. ఎలా పార్టీలో ప్రజలకు చెప్పాలని అన్నారు.కేటీఆర్, కేసీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ లోని బీసీ నాయకులు ఎందుకు నోరు తెరవడం లేదు అంటూ ప్రశ్నించారు. శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మధుసుదనాచారి లాంటివారు నోరు మెదపడం లేదు..? కల్వకుంట్ల కుటుంబం అహంకారాన్ని, బీసీ వ్యతిరేక చర్యలను బడుగులు బలహీన వర్గాలు గుర్తుపెట్టుకుని జూబ్లీహిల్స్ ఎన్నికల్లోబుద్ది చెప్పాలన్నారు.



