- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో ఉండే ముర్షీద్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



