Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవ్యవసాయ కార్మిక పోరాటానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం మద్దతు

వ్యవసాయ కార్మిక పోరాటానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం మద్దతు

- Advertisement -

రూ. 2,18,767 ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఎడబ్ల్యూయూ) సాగిస్తున్న పోరాటానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం మద్దతుగా నిలిచింది. దేశంలో జరుగుతున్న వ్యవసాయ కార్మికుల పోరాటాలకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ రూ. 2,18,767 ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ సహాయాన్ని శుక్రవారం నాడిక్కడ హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లోని ఏఐఏడబ్ల్యూ యూ కార్యాలయంలో సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పి. అభిమన్యు అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘానికి ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, కార్యాలయ కార్యదర్శి బాబులు హృదయపూర్వక కతజ్ఞతలు తెలిపారు. దేశంలో వ్యవసాయ, గ్రామీణ కార్మికుల పోరాటానికి ఈ సహాయం ఎంతో బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. బి. వెంకట్‌ మాట్లాడుతూ గ్రామీణ భారతంలో కనెక్టివిటీ పెంచడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ పాత్ర కీలకమని, అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని విస్మరించి బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని విమ ర్శించారు. తాజాగా స్టార్‌లింక్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని, భారత ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉపగ్రహాలను ప్రేరేపించేందుకు ప్రభుత్వం అడుగు వేయడం కూడా ఈ దిశగా ఉందని దుయ్యబట్టారు.
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.అభిమన్యు మాట్లాడుతూ తమిళనాడులో 1982 జనవరి 19న కార్మికులు, రైతులు సం యుక్తంగా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చిన చారిత్రా త్మక రోజును గుర్తుచేశారు. తిరుమేజ్ఞానం, రెట్టైపులి గ్రామాల్లో ముగ్గురు అమర వీరులు త్యాగం చేసిన నేపథ్యంలో కార్మిక-రైతు ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. ఈ నిధి సేకరణకు వేలాది మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు భాగస్వామ్యం కావడం, గ్రామీణ పోరాటాలకు ఆర్థికంగా బలం అందించడమే కాకుండా, కార్మిక-రైతు ఐక్యతను సుస్థిరం చేస్తుందని పేర్కొ న్నారు. రాబోయే జులై 9 సార్వత్రిక సమ్మె ను దృష్టిలో ఉంచుకొని, అన్ని ప్రజా పోరా టశక్తులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad