Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమ్మెలో పాల్గొన్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 

సమ్మెలో పాల్గొన్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం గాంధీ చౌక్ లోని సంచార్భవన్ ఎదుట బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. నాణ్యమైన 4 జి, 5 జి సర్వీసులు వెంటనే ప్రారంభించాలని, మూడో వేతన సవరణ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వెంటనే చేయాలని, అలాగే రిటైర్ ఉద్యోగులకు పెన్షన్ సవరణ చేయాలని ,నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని , కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, కల్పించాలని అలాగే వారిని రెగ్యులరైజ్ చేయాలని, అనే ప్రధాన డిమాండ్లతో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కోరారు.

ఈ సమ్మెకు ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ అండ్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి సమ్మె శిబిరంలో కూర్చున్నారు .ఈ సమ్మెకు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ,మరియు జిల్లా అధ్యక్షులు, ఈవిల్ నారాయణ, సాయిలు  నాయకత్వం వహించారు . సమ్మెను ఉద్దేశించి ఆలిండియా బిఎస్ఎన్ఎల్ అండ్ డాట్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వై సాయన్న మాట్లాడుతూ.. ఉద్యోగులు పెన్షనర్లు కలిసి బిఎస్ఎన్ఎల్ సమస్యను రక్షించుకోవాలని కోరారు. అలాగే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మదన్మోహన్ పెన్షనర్లపై కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడారు.

ఈ సమావేశంలో డివిజనల్ అధ్యక్షులు సిర్ప హనుమాన్లు, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు బాబా గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు హమీదుద్దీన్, బిఎస్ఎన్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్ , ఆర్ ఎం ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె హుస్సేన్, లావు వీరయ్య, ఎం ఎన్ వి అనురాధ ఇంకా దాదాపు 125 మందికి పైగా ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రజా రైతు వ్యతిరేక విధానాలను తూర్పారబట్టి సమ్మెను విజయవంతం చేశారు. అనంతరం గాంధీ చౌక్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మెలో సిరప లింగం తన గానం ద్వారా సమ్మె ఆవశ్యకతని ప్రభుత్వ విధానాలని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -