Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్విస్తరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.47వేల కోట్ల వ్యయం

విస్తరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.47వేల కోట్ల వ్యయం

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వ టెల్కో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు భారీ వ్యయం చేయనుంది. ఈ ఏడాది మరో రూ.47,000 కోట్లు మూలధనం ఖర్చు చేయనున్నట్టు టెలికం శాఖ గురువారం ఎక్స్‌లో వెల్లడించింది. గతేడాది 4జి మొబైల్‌ సేవల కోసం లక్ష టవర్ల ఏర్పాటుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.25,000 కోట్లు వ్యయం చేసింది. దీన్ని ఈ ఏడాది దాదాపు రెట్టింపు చేయనుంది. గతేడాది రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.47 వేల కోట్లకు పెంచుతున్నట్టు కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad