నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం బహుజన సమాజ్ పార్టీ రూరల్ నియోజకవర్గం సమీక్ష సమావేశం రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నీరడి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నీరాడి లక్ష్మణ్ మాట్లాడుతూ…రూరల్ నియోజకవర్గం పరిధిలో బి.ఎస్.పి పార్టీని బలోపేతం చేసి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే మోపాల్, ఇందాల్ వాయి, నిజామాబాద్ రూరల్ లో పార్టీని బలోపేతం చేయడానికి సెక్టార్, బూత్ కమిటీలను వేసి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. అదేవిధంగా వారం పది రోజులలో మండల కమిటీలు సైతం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు పోతే ప్రవీణ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్, మండల అధ్యక్షులు అనిల్, ఇందల్వాయి మండల అధ్యక్షులు ప్రసాద్, డిచ్పల్లి మండల అధ్యక్షులు హర్ష, రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నియోజకవర్గ కార్యదర్శి ప్రభుదాస్, బి.ఎస్.పి సీనియర్ నాయకులు ఎడ్ల రాములు, బీఎస్పీ నాయకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ రూరల్ నియోజకవర్గ సమీక్షా సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES