Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజోలి-శాంతినగర్ వరకు బీటీ రోడ్డు వేయాలి: కేవీపీఎస్

రాజోలి-శాంతినగర్ వరకు బీటీ రోడ్డు వేయాలి: కేవీపీఎస్

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
గురువారం రాజోలి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాజోలి పొలిమేర నుంచి శాంతినగర్ వరకు బీటీ రోడ్డు వేయాలని ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్బంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి తిప్పన మాట్లాడుతూ.. పది రోజుల క్రిందట కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాజోలి పొలిమేర నుంచి శాంతినగర్ వరకు బీటు రోడ్డు వేయాలని రాష్ట్ర రోకో చేశామని తెలిపారు. ఆ సమయంలో వడ్డేపల్లి తాసిల్దార్ రాజోలి తాసిల్దార్ ఇరువురు కలిసి రెండు మూడు రోజులలో రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చామని అన్నారు. కానీ ఇంతవరకు రోడ్డు నిర్మాణం చేపట్టలేదని, వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని అన్నారు. కెవిపిఎస్ మండల కార్యదర్శి ఆర్ విజయకుమార్ మాట్లాడుతూ.. రాస్తారోకో చేసిన మరుసటి రోజు తూతూ మంత్రంగా జెసిబి తో గుంతల్లో నీళ్లు ఆగి ఉన్నందున వాటిని పక్క పొలములోకి మళ్ళించారని అన్నారు. రోడ్డుకు ఎర్ర మట్టి వేయలేదని అన్నారు. రెండు రోజుల క్రిందట పత్తి వాహనము బోల్తా పడిందని, రైతులకు గాయాలపాలై ఆస్పత్రికి వెళ్లారని, చాలామంది ద్విచక్ర వాహనదారులు కూడా క్రిందపడి కాళ్లకు చేతులకు గాయాలపాలై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -