Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబుద్ధవనం పవిత్రమైన ప్రదేశం

బుద్ధవనం పవిత్రమైన ప్రదేశం

- Advertisement -

ఆర్‌పీఐ జాతీయ అధ్యక్షులు భీమ్‌రావు యశ్వంత్‌
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
బుద్ధవనం బౌద్ధ భిక్షువులకు, అభిమానులకు ఎంతో పవిత్ర ప్రదేశమని ఆర్‌పీఐ జాతీయ అధ్యక్షులు భీమ్‌రావు యశ్వంత్‌ అన్నారు. నల్లగొండ జిల్లా నాగా ర్జున సాగర్‌లోని బుద్ధ వనాన్ని ఆదివారం భీమ్‌రావు యశ్వంత్‌ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నాగార్జునసాగర్‌ విజయపురిసౌత్‌లో మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. సాగర్‌ సందర్శన లో భాగంగా బుద్ధవనంలో బుద్ధచరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘుచిత్రాన్ని వీక్షించారు. బుద్ధ విగ్రహం వద్ద బుద్ధజ్యోతిని వీరికి బుద్ధ వనం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన, ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర అందించారు. సన్మానం చేసి మెమెంటోలు, బ్రోచర్లను బహూకరించారు. ఈ సందర్భంగా భీమ్‌రావు యశ్వంత్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ లో బుద్ధవనాన్ని మహా అద్భుతంగా నిర్మించిందన్నారు. కార్యక్రమంలో రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు దేవిప్రసాద్‌, కెప్టెన్‌ ప్రవీణ్‌ నికాడే,మేజర్‌ చంద్రకాంత్‌, లక్ష్మయ్య, సమతా ప్రసాద్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -