- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ: ఉమ్మడి బాల్కొండ మండల బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం డివిషన్ బాడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల్లో ఉమ్మడి బాల్కొండ మండలం ప్రైవేట్ స్కూల్ అధ్యక్షునిగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ, సెక్రటరీగా న్యూ హరిజన్ స్కూల్ కరస్పాండెంట్ భూసరత్నాకర్, ట్రెజరర్ గా లిటిల్ ఫ్లవర్ స్కూల్ అజ్మత్ పాషా లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీ, డివిజన్ ప్రెసిడెంట్ గిరి, సెక్రెటరీ రవీందర్, ట్రెజరర్ హరీష్, మండల వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
- Advertisement -