- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముత్తిరెడ్డి గూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జక్కుల ఆంజనేయులు వ్యవసాయ బావి వద్ద మేత కోసం వెళ్లగా , ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై చనిపోయిందని తెలిపారు. సుమారు గేద విలువ లక్ష ఇరవై వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -