Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమల నాథస్వామి జాతరలో ఎడ్ల పందాలు

తిరుమల నాథస్వామి జాతరలో ఎడ్ల పందాలు

- Advertisement -
  • భారీగా తరలి రానున్న తెలుగు రాష్ర్ట ప్రజలు
    నవతెలంగాణ – పెద్దవూర
    నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాల సరిహద్దులో గల బోనూతల (కోనేటిపురం) హాలియా నుండి సాగర్ వెళ్ళే మార్గంలో కుంకుడు చెట్టుతండ గ్రామం తూర్పువైపున తిరుమల కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీతిరుమల నాథ స్వామి జాతర సందర్బంగా ఈ నెల31 న 108 కలశములచే పద్మావతి సమేత తిరుమలనాధస్వామి వారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మాజీ జీడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపిపిఆంగోత్ భగవాన్ నాయక్ హాజరై ప్రత్యేక పూజలునిర్వహించనున్నారు.
  • ఫిబ్రవరి 1 న తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందాలు జరుగునున్నాయి. మొదటి బాహుమతి రూ.60,000/- రెండవ బాహుమతి రూ.40,000/- మూడవబహుమతి రూ. 30,000/- నాలుగవ బహుమతి రూ.20000/- ఐదవ బహుమతి రూ.20,000/- ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు ఇవ్వునున్నారు. ఈ ఉత్సవాలు కార్యనిర్వాహణాధికారి ప్రధాన అర్చకులు రాయప్రోలు మురళీ గురుస్వామి దేవాలయ ఛైర్మన్కల్లూరి వెంకటేశ్వర్రెడ్డి, వైస్  చైర్మన్ దండు భిక్షం, కార్యదర్శి రమావత్ లచ్చిరాం నాయక్, ప్రధాన కార్యదర్శి పగడాల తిరుమల్ యాదవ్, కమిటి సభ్యుల మేగావత్ రవి నాయక్, రమావత్ మధు నాయక్, రమావత్ శంకర్ నాయక్, పాశం నాగార్జునరెడ్డి, తుమ్మలపల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల పందాలు, జాతర నిర్వహించనున్నారు. ఈ పందాలను తిలకించుటకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ప్రజలు హాజరు కానున్నారు. వారందరికీ ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేశారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -