Wednesday, July 9, 2025
E-PAPER
Homeఆటలులార్డ్స్‌ సవాల్‌కు బుమ్రా సిద్ధం

లార్డ్స్‌ సవాల్‌కు బుమ్రా సిద్ధం

- Advertisement -

నెట్స్‌లో పేస్‌ దళపతి సాధన
నవతెలంగాణ-లండన్‌
: టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీ రేసు రసవత్తరంగా మారగా భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా లార్డ్స్‌ సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. వర్క్‌లోడ్‌తో బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. గురువారం నుంచి ఆరంభం కానున్న లార్డ్స్‌ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. చివరగా లీడ్స్‌ టెస్టులో బౌలింగ్‌ చేసిన బుమ్రా.. సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం లార్డ్స్‌లో బంతి అందుకున్నాడు. ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్లో గంట పాటు కొత్త బంతితో సాధన చేశాడు. సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌, అభిమన్యు ఈశ్వరన్‌, ధ్రువ్‌ జురెల్‌కు బుమ్రా నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌ ఈ ప్రాక్టీస్‌ సెషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టుకు లార్డ్స్‌లో పేస్‌ పిచ్‌ సిద్ధం కానుండటంతో జశ్‌ప్రీత్‌ బుమ్రా శుభ్‌మన్‌ గిల్‌ సేనకు కీలకం కానున్నాడు. ఆకాశ్‌ దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌తో కలిసి బుమ్రా కొత్త బంతితో నిప్పులు చెరగటానికి లార్డ్స్‌లో రంగం సిద్ధమవుతుంది.
మంగళవారం లార్డ్స్‌ గ్రౌండ్‌లో జరిగిన ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌కు కెప్టెన్‌ గిల్‌ హాజరు కాలేదు. శుభ్‌మన్‌ సహా కెఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌లు విశ్రాంతి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -