- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పుగోదవరి జిల్లా కొవ్వూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న RRR ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటనతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి వేళ ప్రయివేటు బస్సు దగ్ధమవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదంలో 19మంది మరణించిన విషయం తెలిసిందే.
- Advertisement -



