Tuesday, November 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబస్సు ప్రమాదం..పోస్టుమార్టం పూర్తి.. స్వగ్రామాలకు మృతదేహాల తరలింపు

బస్సు ప్రమాదం..పోస్టుమార్టం పూర్తి.. స్వగ్రామాలకు మృతదేహాల తరలింపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇప్పటి వరకు 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

అలాగే చేవెళ్ల ఆస్పత్రిలో మృతుల పోస్టుమార్టం కోసం గాంధీ, ఉస్మానియా నుంచి ఫోరెన్సిక్ నిపుణులతో 12 మంది వైద్య బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రమాదంలో మరణించిన 19 మంది పోస్టుమార్టం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం అన్ని మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి స్వగ్రామాలకు తరలించి, కుటుంబ సభ్యులకు అందజేశారు.

కాగా, చేవెళ్ల రోడ్డు ప్రమాద బాధితులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. పేషెంట్ల కండీషన్‌ను మంత్రికి వివరించిన డాక్టర్లు.. ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజూరి అయిందని, మిగిలిన పేషెంట్లందరి కండీషన్ స్టేబుల్‌గా ఉందని డాక్టర్లు మంత్రికి వివరించారు. క్షతగాత్రులకు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. బస్సు కండక్టర్‌తో మాట్లాడి యాక్సిడెంట్ జరిగిన తీరును మంత్రి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -