నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఏకంగా 15 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన శ్రీలంకలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లా-వెల్లవాయ మెయిర్ రహదారిపై టాంగల్లె మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగులను తమ గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే 24వ కి.మీ. మైలురాయి వద్ద బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న భారీ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్పాట్‌లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి పరిస్థితి భయానకంగా ఉంది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మీ, వైమానిక దళ సిబ్బంది స్పాట్‌కు చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోయలో పడిపోయిన బస్సు..15 మంది దుర్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES