Tuesday, June 24, 2025
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి నుంచి పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీస్..

సత్తుపల్లి నుంచి పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీస్..

- Advertisement -

ఈనెల 27 న నుండే  ప్రారంభం…
ప్రచార కరపత్రాలు విడుదల చేసిన మేనేజర్ యు.రాజ్యలక్ష్మి, సిఐ పింగళి నాగరాజులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: టీజీ ఆర్టీసీ సత్తుపల్లి డిపో నుంచి ఆంధ్రాలోని అయిదు పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీస్ సౌకర్యం కల్పించామని, ఈ సర్వీస్ ఈ నెల 27 నే ప్రారంభం అవుతుందని సత్తుపల్లి డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం అశ్వారావుపేట బస్ స్టాండ్ లో ఈ సర్వీస్ కు చెందిన ప్రచార కరపత్రాలను స్థానిక సీఐ నాగరాజు తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ సత్తుపల్లి డిపో నుండి 5 పుణ్యక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక డీలక్స్ బస్సు ను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్ సర్వీస్ ఈ నెల 27 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు సత్తుపల్లి నుండి బయలుదేరి ఐదు పుణ్యక్షేత్రాలను దర్శింప చేసుకుని అదే రోజు రాత్రి 10 గంటలకు తిరిగి సత్తుపల్లి చేరుకుంటుంది అని అన్నారు. ముందుగా సత్తుపల్లి నుండి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం మండలం లోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం, తరువాత ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం, కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తో పాటు పెనుగొండ లోని కన్యకా పరమేశ్వర మాత ఆలయం, చిన్న తిరుపతిగా పేరొందిన దివ్య పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల పుణ్యక్షేత్రాలను దర్శింప చేయనున్నట్లు ఆమె వివరించారు. ఈ ఐదు పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు డీలక్స్ బస్సు చార్జీ పెద్దలకు రూ.1000 లు,పిల్లలకు రూ.500 లు గా నిర్ణయించినట్లు ఆమె ప్రకటించారు. దేవాలయాలలోని ఇతర టికెట్ లు మరియు ఇతర ఖర్చులు భక్తులే భరించాలి అని ఆమె అన్నారు.మరిన్ని వివరాలకు 9866619189, 9542698518 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని అన్నారు.  సిఐ పింగళి నాగరాజు మాట్లాడుతూ టీజీ ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి భక్తుల కొరకు ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమని అన్నారు.సత్తుపల్లి డిపో పరిధిలోని,అశ్వారావుపేట,దమ్మపేట మండలాల భక్తులందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విలేజ్ బస్ ఆఫీసర్ ఆనందరావు,కంట్రోలర్ ఎన్.వీ.ఎస్ రావు,రిటైర్డ్ డ్రైవర్ కేవీ రావు( కంభంపాటి వెంకటేశ్వరరావు) లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -