Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్బస్సుల్లో చోరీల ముఠా సభ్యుడి అరెస్ట్‌

బస్సుల్లో చోరీల ముఠా సభ్యుడి అరెస్ట్‌

- Advertisement -

– హైవేలపై అంతర్రాష్ట్ర ‘థర్‌ గ్యాంగ్‌’ దొంగతనాలు
– 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
– నిందితుడికి రిమాండ్‌ : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ వివరాలు వెల్లడి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

హైవేలపై దాబాల వద్ద ఆగి వున్న బస్సులను లక్ష్యంగా చేసుకుని ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, డబ్బులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ‘థర్‌ గ్యాంగ్‌’ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. రూ.85 లక్షల విలువగల 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకు న్నామని నల్లగొండ ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ తెలి పారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాల యంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత డిసెంబర్‌ 5న చిట్యాల పోలీసు స్టేషన్‌ పరిధిలో బస్సులో భారీ పెద్దమొత్తంగా బంగారం ఆభరణాల చోరీ జరి గింది. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టిం చింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ.. హైవేల వెంట దాబాల వద్ద ఆగి ఉన్న బస్సు లను లక్ష్యంగా చేసుకొని ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠాలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలు సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించటానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయో గించి.. బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్నది మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం థర్‌ జిల్లాకు చెందిన నేరస్థులుగా గుర్తించారు. రెండు ప్రత్యేక బృందాలు మధ్యప్రదేశ్‌ కు వెళ్లాయి. ఈ బృందాలు 15 రోజులపాటు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి నేరస్తు లపై ప్రత్యేక నిఘా ఉంచాయి. థర్‌ జిల్లాలోని ధర్మపురి తాలుకా ఖల్ఘాట్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ ఆషాఅల్లా రఖాను మనవార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉమర్భాన్‌ క్రాస్‌ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని విచారించారు. ఐదుగురు సభ్యులతో థర్‌ గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతు న్నారు. అతనితోపాటు అష్రఫ్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, జాబర్‌ఖాన్‌, ఉమర్‌ఖాన్‌తో కలిసి చిట్యాల వద్ద బస్సులో చోరికి పాల్పడినట్టు విచారణలో తేలింది. కొన్నేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో హైవేలపై ప్రయాణించే బస్సులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్టు నిందితుడు అంగీకరించాడు. 2022, 2023లో కూడా విజయ వాడ హైవేపై హోటల్స్‌ వద్ద ఆగి ఉన్న బస్సుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు, బంగారు ఆభర ణాలను చోరీ చేశారు. నిందితుడిని థార్‌ జిల్లాలోని మునవ్వర్‌ న్యాయస్థానంలో హాజరు పరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై నల్లగొండ జిల్లాకు తీసుకొచ్చారు. అతన్ని జిల్లా కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మిగతా ముఠా సభ్యులను కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

పోలీసులకు అభినందన, రివార్డు
చోరీ ముఠా సభ్యుడిని సీసీఎస్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి పర్యవేక్షణలో పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన చిట్యాల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, సీసీఎస్‌ ఎస్‌ఐ శివ కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్‌ వెంకటేష్‌, సాయికుమార్‌, జూనేద్‌, శివరాజు, మహేశ్‌, కమల్‌ కిశోర్‌, చిన్నబాబు, సీసీఎస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి రివార్డు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -