- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్టేట్స్‌విల్లే రీజనల్ విమానాశ్రయంలో సెసనా c550 జెట్ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో అమెరికా ప్రముఖ కార్ రేసర్ గ్రెగ్ బిఫిల్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మిగతా ముగ్గురి ఆచూకీ తెలియారాలేదు. ఈ ప్రమాదం కారణంగా ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కొద్దిపాటి వర్షం పడినట్లు తెలుస్తోంది. ఇదంతా టీవీ ఫుటేజీలో రికార్డు కావడం గమనార్హం.
- Advertisement -



