డబ్ల్యూకామర్స్ కోఫౌండర్ శ్రీధర్ వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్
సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని చిరు వ్యాపారులు, వ్యక్తులు ఎవరైనా వ్యాపారం ప్రారంభించవచ్చని డబ్ల్యూకామర్స్ కో-ఫౌండర్, సీఓఓ శ్రీధర్ శ్రీరామనేని వెల్లడించారు. సరుకులు నిల్వ చేయాల్సిన అవసరం లేదని, పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయవచ్చన్నారు. డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డబ్ల్యుకామర్స్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలపై విక్రేతల పేరుతో కంపెనీ ఒక ఆన్‌లైన్ స్టోర్‌ను క్రియేట్ చేస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఈ ఆన్‌లైన్ స్టోర్‌కు సంబంధించిన లింక్ లేదా క్యూఆర్ కోడ్‌ను పోస్ట్ చేయడం, లేదా బంధువులు, స్నేహితులకు షేర్ చేయడం ద్వారా కంపెనీ ఆఫర్ చేసే ఉత్పత్తులను ఎవరు కొనుగోలు చేసినా.. విక్రేతకు 20-40 శాతం లాభం వస్తుందన్నారు. డెలివరీ బాధ్యతలను తమ సంస్థ తీసుకుంటుందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22,000లకుపైగా యాక్టివ్ ఆన్‌లైన్ స్టోర్స్ ఉన్నాయని డబ్ల్యూకామర్స్ శ్రీధర్ పేర్కొన్నారు. కిరాణా వర్తకులు కూడా డబ్ల్యుకామర్స్ ప్లాట్‌ఫాంలో లభించే ఉత్పత్తులను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించవచ్చన్నారు. ప్రస్తుత తరుణంలో ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులకు పెట్టుబడి లేని వ్యాపారానికి ఇది చక్కని వేదికన్నారు.
పెట్టుబడి లేకుండానే వ్యాపారం
- Advertisement -
- Advertisement -



