- Advertisement -
ఐదు రోజులు అన్న ప్రసాద వితరణ
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ సేవాప్రదాత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్-బుసిరెడ్డి పాండు రంగారెడ్డి, వీణ దంపతులు హాలియా మున్సిపాలిటీ లో కేంద్రంలో అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం, హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్నప్రాసద వితరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా 5 రోజులు అన్న ప్రసాద వితరణ చేసి స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గురు స్వామి స్వాములు మేడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ.. బుసిరెడ్డి దంపతులకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని, మీ సేవ తత్పరణ సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఎళ్లపుడు ఉండాలని అన్నారు.
- Advertisement -



