- Advertisement -
- – ఆత్మ బంధు ద్వారా అన్నధానంఅన్ని దానాలల్లో అన్నదానం మిన్న
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్నా. నాగార్జున సాగర్ నియోజకవర్గం లో బుసిరెడ్డి పాండన్న పిలుపు మేరకు ఆత్మబంధు.కార్యక్రమంలో భాగంగాపెద్దవూర మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన షేక్ ఉషనా, నిడమనూరు మండలం గుంటకగూడెం గ్రామానికి చెందిన సరి సోవమ్మ,మాడుగుల పల్లి మండలం పూసలపాడు గ్రామానికి చెందిన మల్లూరి నాగేష్,త్రిపురారం గ్రామానికి చెందిన కొంచెం సుక్కమ్మ, మాడుగుల పల్లి మండలం, గారకుంటపాలెం గ్రామానికి చెందిన మామిడి భూలక్ష్మి, తిరుమలగిరి సాగర్ మండలం, బట్టువెంకన్న బావి తండా గ్రామానికి చెందిన జాటావత్ సలూకు నాయక్ మృతి చెందారని తెలుసుకొని అంత్యక్రియలు అనంతరం అక్కడికి వచ్చింది బంధువులకు అన్నా దానం కార్యక్రమం చేపట్టారు.సందర్బంగా బుసిరెడ్డి పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నిరుపేదల ఆదరిద్దాం అనే సరుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -