Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల ఉత్పత్తుల్ని కొనండి.. 

మహిళా సంఘాల ఉత్పత్తుల్ని కొనండి.. 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
స్వశక్తి సంఘాలచే తయారు కాబడ్డ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం ద్వారా మహిళల ఆర్థిక వృద్ధికి తోడ్పడిన వారమవుతామని మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ అన్నారు. స్వశక్తితో తయారు చేస్తున్న ఉత్పత్తులను కొని మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. 100 రోజులు- 50 కార్యక్రమాలలో భాగంగా శనివారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో 20 మహిళా సమాఖ్యలచే ఏర్పాటుచేసిన ఎస్ హెచ్ జీ ఉత్పత్తుల ప్రదర్శనను టీపీఓ గిరిధర్, మెప్మా సీఓ రేణుకతో కలిసి ఆయన పరిశీలించారు.

అందులో భాగంగా పీఎఫ్ఎంఎస్ యూనిట్స్, ఎంబ్రాయిడరీ, మొక్కల పెంపకం, మిల్క్ ప్రొడక్ట్స్, పర్యావరణహిత పేపర్ ప్లేట్లు, స్వీట్స్, పిండి వంటలు వంటి యూనిట్లను పరిశీలించి అభినందించారు. మున్సిపల్ పరిధిలో వివాహాది శుభ కార్యక్రమాలకు మహిళ సంఘాలచే నిర్వహించబడుతున్న స్టీల్ బ్యాంక్ ( స్టీలు ప్లేట్లు, స్టీలు గ్లాసులు) ను, పర్యావరణహిత పేపర్ ప్లేట్లను మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం

మెప్మా సీవో రేణుక మాట్లాడుతూ.. 100 రోజులు- 50 కార్యక్రమాలలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 62 మహిళా సమాఖ్య సంఘాలకు ప్రభుత్వం రూ.8 కోట్ల బ్యాంకు రుణాలను టార్గెట్ విధించగా.. ఇప్పటివరకు రూ.3 కోట్ల 50 లక్షల వరకు రుణాలను ఇప్పించడం జరిగిందన్నారు. ఇందిరా మహిళా శక్తి యూనిట్స్ లో భాగంగా మహిళలకు వారి వ్యాపార అభివృద్ధి కోసం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్స్ ఇప్పించడం జరిగిందని వెల్లడించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, మెప్మా ఆర్పీలు, మహిళ సమాఖ్య సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -